RRR: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్!

UPDATED 1st APRIL 2022 FRIDAY 10 :00 PM

RRR: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక రివ్యూలు కూడా బాగా రావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వాలు అనుమతులివ్వడం లాంటి అనుకూల పరిస్థితులతో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, బాక్సాఫీస్‌ను కలెక్షన్స్‌తో షేక్ చేస్తోంది.

తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్ వరకు అదే జోరును కొనసాగించింది. ఇక అసలైన వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమా వసూళ్లు కాస్త నెమ్మదించాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.710 కోట్ల మేర గ్రాస్.. రూ.392 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. బాహుబలి 2 చిత్రం తరువాత ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ నిలిచింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కేమియో పాత్రలో నటించాడు.

అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.77.22 కోట్లు

సీడెడ్ – రూ.37.28 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.20.97 కోట్లు

ఈస్ట్ – రూ.11.16 కోట్లు

వెస్ట్ – రూ.9.76 కోట్లు

గుంటూరు – రూ.14.03 కోట్లు

కృష్ణా – రూ.10.78 కోట్లు

నెల్లూరు – రూ.6.45 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.187.65 కోట్లు (షేర్) (రూ.279.50 కోట్లు గ్రాస్)

కర్ణాటక – రూ.27.75 కోట్లు

తమిళనాడు – రూ.25.30 కోట్లు

కేరళ – రూ.7.60 కోట్లు

హిందీ – రూ.65.60 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – రూ.5.10 కోట్లు

ఓవర్సీస్ – రూ.73.45 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.392.45 (షేర్) (రూ.710 కోట్లు గ్రాస్)

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us