UPDATED 29th AUGUST 2022 MONDAY 08:00 PM
OTT Releases : ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలే ఎక్కువ. లాక్ డౌన్ తర్వాత నుండి నార్మల్ ఆడియెన్స్ తో పాటు సినిమా లవర్స్ అంతా ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. అంతేగాక థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలన్నీ.. నెలా రెండు నెలలు పూర్తికాకముందే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ ఓటిటిలతో పాటు కొత్త ఓటిటిలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఉన్నవాటిలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటిటిలు థియేట్రికల్ రిలీజైన సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. స్ట్రీమింగ్ కి సిద్ధమైన సినిమా హక్కులను దక్కించుకుని ప్రతివారం ఓటిటిలో రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వారంలో ఓటిటి విడుదలకు 9 ఇండియన్ సినిమాలు రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న ఇండియన్ సినిమాలేంటో చూద్దాం!
ఆహా(Aha):
- ఆగష్టు 31 – పెళ్లికూతురు పార్టీ
- ఆగష్టు 31 – పంచతంత్ర కథలు
జీ5(Zee5):
- సెప్టెంబర్ 2 – విక్రాంత్ రోణ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
- సెప్టెంబర్ 2 – మై డియర్ భూతం (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
- సెప్టెంబర్ 2 – ఖుదా హాఫిజ్(హిందీ) సీజన్ 2
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
- సెప్టెంబర్ 2 – కట్ పుత్లి(హిందీ)
నెట్ ఫ్లిక్స్(Netflix):
- ఆగష్టు 28: హిట్: ది ఫస్ట్ కేస్ – హిందీ(స్ట్రీమింగ్ మొదలైంది)
- సెప్టెంబర్ 2 – కట్టేరి(తమిళం. తెలుగు, కన్నడ, మళయాలం)
సోనీ లివ్(Sony LIV ):
- సెప్టెంబర్ 2 – సుందరి గార్డెన్స్ (మలయాళం)
అలా మొత్తానికి ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది ఇదే మొదటిసారి కాదు. మరి పైన పేర్కొన్న 9 ఓటిటి సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.







