UPDATED 17th OCTOBER 2022 MONDAY 06:10 PM
YSR Rythu Bharosa : వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.ఏపీలో ఈ పథకం వరుసగా నాలుగో ఏడాది అమలవుతోంది. కాగా, ఈ ఏడాది మే నెలలో తొలి విడతగా రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండో విడత సందర్భంగా రూ.4 వేల చొప్పున బదిలీ చేసింది.ఇక మూడో విడతలో భాగంగా వచ్చే జనవరిలో రూ.2 వేల చొప్పున విడుదల చేయనున్నారు.
రైతు భరోసా-పీఎం కిసాన్ లో భాగంగా ఏటా రైతుకు రూ.13,500 మేర సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. రెండో విడతగా రూ.4వేలు నేడు అందించారు. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందిస్తారు. రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 ప్రభుత్వం అందిస్తోంది.







