New year celebrations : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. పాల్గొనేవారు ఇవి పాటించాల్సిందే.. లేదంటే...

డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో వేడుకలకు అనుమతి లేదు...

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు నిర్వహించుకోవాలని ఆర్డీవో పి. వెంకటరమణ కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ (ఒమిక్రాన్) ప్రభావము అధికంగా ఉన్నందున నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్త వహించాలని, అనవసరంగా ఎవ్వరూ బయట తిరగకూడదని అన్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవని, ప్రతీ ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో వారి ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఏఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంపులుగా ఒకేచోట గుమికూడి పబ్లిక్ ప్రదేశములలో ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బహిరంగ ప్రదేశములలో ఎవరైనా కేకులు కట్ చేయడం, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమన్నారు. మోటారు వాహనాలకు సైలెన్సర్ లు లేకుండా తిరిగి ధ్వని కాలుష్యం కలిగించి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చర్యలు తీసుకుని వారి వాహనం సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి ఆర్కెస్ట్రా, అశ్లీల నృత్యాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us