కనులపండువగా స్వామివారి కల్యాణవేదిక శిఖరప్రతిష్ఠ

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబరు 2021: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలోని శ్రీనివాస ప్రాంగణంలో దాతలు అందించిన రూ.కోటితో వార్షిక కల్యాణ వేదిక శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం శోభాయమానంగా నిర్వహించారు. ఉదయం 11.33 గంటలకు కల్యాణవేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు శిఖర ప్రతిష్ఠను కనుల పండువగా నిర్వహించారు. స్థల దాత పీపీ కృష్ణమ్మ కుటుంబ సభ్యులు, వేదిక నిర్మించిన కాంట్రాక్టర్లు మేడపాటి శ్రీనివాసరెడ్డి, సత్తి సూర్యభాస్కరరెడ్డి, కర్రి తాతారెడ్డి, మల్లిడి విజయభాస్కరరెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, మేడపాటి వెంకటసత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. కల్యాణ వేదిక నిర్మించిన దాతలను ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఘనంగా సత్కరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us