UPDATED 10th OCTOBER 2022 MONDAY 10:00 PM
POCSO Case : తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి (Chandramampalli) గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రావూరి మురళీమోహన్ (Ravuri Murali Mohan) తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన భవన నిర్మాణ రంగంలో పనిచేసే ఎన్. వీర్రాజు (Veerraju) అనే 29 ఏళ్ల యువకుడు గ్రామంలో ఉంటున్న తొమ్మిదేళ్ల బాలిక సమీపంలో ఉన్న ఓకిరాణా దుకాణం వద్దకు చాక్లెట్ కొనుక్కునేందుకు రావడంతో ఆబాలికను సమీపంలో ఉన్న రేకుల షెడ్డులోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆబాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. జరిగిన విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేసి నిందితుడిపై ఐపీసీ 354, సెక్షన్ 7 r/w 8 పోక్సో చట్టం కింద కేసు (Crime No : 351/2022) నమోదు చేశారు. అలాగే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.







