నవనిర్మాణ దీక్ష ద్వారా ప్రజలు అభివృద్ధిని తెలుసుకుంటున్నారు

UPDATED 4th JUNE 2017 SUNDAY 6:00 PM

పెద్దాపురం: నవనిర్మాణ దీక్ష ద్వారా ప్రజలు అభివృద్ధిని తెలుసుకుంటున్నారని సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ మన్యం పద్మావతి అన్నారు. స్థానిక రామారావు పేట ఉన్న బ్రాహ్మణ కళ్యాణమండపంలో నవనిర్మాణ దీక్ష మూడోరోజు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా  నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. మరో ముఖ్య అతిధిగా హాజరైన పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజాసూరిబాబురాజు మాట్లాడుతూ ఈ రోజు వ్యవసాయం, నీటియాజమాన్యం, ఉద్యానవన శాఖలు మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా రైతులకు వారికి అందే పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు వారికి సంబందించిన  అంశాలపై చర్చ జరుగుతుందని వ్యవసాయపరంగా రైతులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందించడమే కాకుండా స్టాల్స్ ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందన్నారు. పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు.  నవనిర్మాణ దీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన బుర్రకథ కళారూపాన్ని పలువురు తిలకించారు. ఈ కార్యక్రమంలో  పెద్దాపురం, సామర్లకోట ఎంపిపిలు గుడాల రమేష్, మార్త, మున్సిపల్ కమిషనర్లు బి.ఆర్.శేషాద్రి, వెంకటేశ్వరరావు, మేనేజర్ ప్రసాద్, ఎంపీడీవో పల్లాబత్తుల వసంతమాధవి, నాగేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us