విద్యార్థి లక్ష్యసాధన కోసం నిరంతరం కృషిచేయాలి

UPDATED 5th DECEMBER 2017 TUESDAY 5:30 PM

గండేపల్లి: విద్యార్థి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని ప్రముఖ వక్త, ఆర్.ఎస్.ఎస్. రాష్ట్ర ప్రచారక్ సభ్యులు భరతకుమార్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో మంగళవారం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు అధ్యక్షతన వ్యక్తిత్వవికాసంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిధిగా ప్రముఖ వక్త, ఆర్.ఎస్.ఎస్. రాష్ట్ర ప్రచారక్ సభ్యులు భరతకుమార్ హాజరైనారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతీరోజు శరీరానికి తగినంత వ్యాయామం, ఒక మంచి పుస్తకం, దినపత్రిక చదవడం అలవరచుకోవాలని, అనవసరమైన విషయాలపై సమయాన్ని వృథాచేయడం మాని, అవసరమైన విషయాలపట్ల దృష్టి కేంద్రీకరించాలన్నారు. అనంతరం భరత్ కుమార్ ను ఆదిత్య విద్యా సంస్థల తరఫున కళాశాల ప్రిన్సిపాల్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ సభ్యులు కె.ఎస్.ఎస్. నారాయణ, లక్ష్మణ్, జి.మాధవ్ జీ , అధిక సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.    
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us