RRR Ticket‌ : ఏపీలో RRR మూవీ టికెట్‌ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల

UPDATED 17th MARCH 2022 THURSDAY 09:40 PM

RRR movie ticket‌ price : ఏపీలో ట్రిపుల్‌ ఆర్‌ మూవీ టికెట్‌ రేట్లపై స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. ఒక్కో టికెట్‌పై 75 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 363 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు…ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌…ఏపీ సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం..టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చింది. రిలీజ్‌ అయినప్పటి నుంచి పది రోజుల వరకు అధిక రేట్లకు టికెట్‌ విక్రయించుకోవచ్చు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్స్, మల్టిఫ్లెక్సీల వారీగా…ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్‌ ప్రీమియంగా టికెట్‌ రేట్లను నిర్దేశించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు ఉన్న రేట్లకు ట్రిపుల్‌ ఆర్‌ రేట్లకు ప్రతి టికెట్‌పై 75 రూపాయల పెంపు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కార్పొరేషన్లలోని ఏసీ థియేటర్లలో ఇంతవరకు నాన్‌ ప్రీమియం 70 గా ఉంటే..ఇప్పుడు 145 కానుంది. ప్రీమియం టికెట్ 100 నుంచి 175కు పెరగనుంది. కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లలో 100.., 125 రూపాయలుగా ఉన్న టికెట్‌ రేట్లు 175.., 200 కానున్నాయి. కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో 150.., 250 గా ఉన్న టికెట్ రేట్లు.. 225.., 325 కానున్నాయి.మున్సిపాలిటీల్లోని ఏపీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం 60 రూపాయలుగా ఉన్న టికెట్ ధర ట్రిపుల్‌ ఆర్‌కు మొదటి 10 రోజులు 135కు అమ్ముకోవచ్చు.

ప్రీమియం టికెట్ ధర 80 నుంచి 155కు పెరగనుంది. మున్సిపాలిటీల్లోని నాన్‌ ఏసీలో టికెట్‌ ధరలు 30, 50 గా ఉంటే ఇప్పుడవి 105, 125 కానున్నాయి. మున్సిపాలిటీల్లోని మల్టీప్లెక్స్‌ల్లో 125 రూపాయల టికెట్ 200కు అమ్ముకోవచ్చు. 250 రూపాయల టికెట్‌ 325కు పెంచుకోవచ్చు.నగర పంచాయతీల్లోని ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం టికెట్ 50 రూపాయలు ఉంటే..ట్రిపుల్‌ ఆర్‌కు 125 కానుంది. ప్రీమియం కేటగిరీలో 70 రూపాయల టికెట్‌ 145 కానుంది.

నగర పంచాయతీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో 20 రూపాయల టికెట్ 95 కానుంది. 40 రూపాయల టికెట్‌ 115 కానుంది. నగర పంచాయతీల్లోని మల్టీప్లెక్స్‌ల్లో 100 రూపాయల టికెట్‌ 175కు అమ్ముకోవచ్చు. 250 రూపాయల టికెట్‌ 325కు పెరగనుంది.

ఇటీవల డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్య స్వయంగా సీఎం జగన్ ను కలసి టికెట్ రేట్లపై చర్చించారు. ఆ చర్చలు ఫలితం ఇచ్చాయి. మంత్రి పేర్ని నాని… ఇవాళ స్వయంగా టికెట్ల రేట్ల పెంపుపై సంకేతాలిచ్చారు. ఆ వెంటనే జీవో ఇచ్చారు. అన్నట్లుగానే ఒక్కో టికెట్‌పై 75 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. ఏపిలో కూడా ఆర్‌ ఆర్‌ ఆర్ బిజెనెస్‌ విషయంలో క్లారిటీ రావడంతో ట్రిపుల్ ఆర్ టీమ్ ఖుషీ చేసుకుంటోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us