UPDATED 24th MAY 2017 WEDNESDAY 4:00 PM
పెద్దాపురం: దీపం పథకం మహిళలకు వరం అని పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు.స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా దీపం పథకం ధృవపత్రాలను బుధవారం అందచేశారు. మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం రూ.880 కే గ్యాస్ కనెక్షన్ ను అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో 28 వార్డులకు సంబంధించి 836 గ్యాస్ కనెక్షన్స్ ను కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటిలో 436 మందికి గ్యాస్ కనెక్షన్స్ ను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.ఆర్.శేషాద్రి, మేనేజర్ ప్రసాద్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.







