Shocking News: గద్వాల జిల్లాలో విచిత్ర ఘటన.. చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు

UPDATED 13th NOVEMBER 2022 SUNDAY 2:05 PM

Shocking News: కంటి నుంచి నీళ్లు రావటం మనకు తెలుసు. కానీ, లక్ష్మీ దీపాలి అనే చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో నొప్పిగా ఉండటంతో గత రెండు రోజుల నుండి చిన్నారి విలవిల్లాడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చిన్నారిని తరలించి చికిత్స అందించారు.

పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు బియ్యం, రాళ్లు వంటివేమీ లేవని పేర్కొన్నారు. అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఆ చిన్నారి కండ్ల వెంట బియ్యంగానీ, రాళ్లు గానీ రాకపోవటంతో వైద్యులు అలా పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

లక్ష్మీ దీపాలికి 11యేళ్లు. గద్వాల జిల్లాలోని మానవపాడుకు చెందిన రంగన్న, లక్ష్మీ దంపతుల కుమార్తె. గత రెండు రోజులుగా లక్ష్మీ దీపాలి ఈ సమస్యతో బాధపడుతుంది. ప్రతీరోజూ పాప కంటి నుంచి 10 నుంచి 13 చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తాయని, ఆ సమయంలో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతుందని దీపాలి తల్లిదండ్రులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us