Delhi: కడుపులో దాచిన కొకైన్‌.. విలువ రూ.845 కోట్లకు పైనే..

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల పట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. దిల్లీ విమానాశ్రయంలో బుధవారం 992 గ్రాముల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.845కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాత్రల రూపంలో ఉన్న ఈ కొకైన్‌ను సదరు మహిళ కడుపులో దాచి దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 91 కొకైన్‌ క్యాప్సుల్స్‌ని మహిళ మింగినట్లు అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us