రెడ్ బీ న్యూస్, 18 డిసెంబర్ 2021: ప్రభాస్ కథానాయకుడిగా కె.కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ వేడుకను ఈనెల 23న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అభిమానులే అతిథులని.. కొవిడ్ నిబంధనలకు పాటిస్తూ వేడుకలో పాల్గొనాలని తెలిపారు. అదే రోజున ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగానే ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్లు విడుదల చేయనున్నారు. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ ఆర్.రవీందర్ రెడ్డి, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస.







