UPDATED 2nd MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ఎంపిపి ఎన్నిక నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపిటిసి సభ్యులు ఎవ్వరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని గురువారంకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి వై.ఎస్. హరనాధరావు తెలిపారు. సామర్లకోట ఎంపిపి గొడతా మార్త ఇటీవల మృతి చెందడంతో వైస్ ఎంపిపిగా ఉన్న ఆకునూరి సత్తిబాబు అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఎంపిపి స్థానానికి ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అధ్యక్ష ఎన్నికు ఎంపిటిసిలు ఎవరూ హాజరుకాకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.







