భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు

UPDATED 4th MARCH 2018 SUNDAY 8:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట పట్టణం స్థానిక నాగిశెట్టి వారి వీధిలో సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన కోదండ రామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయాన్ని పునర్ నిర్మించి స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. మాండవ్య నారాయణస్వామి ఆలయ చైర్మన్ రెడ్నం వెంకట్రావు (దొరబాబు) దంపతుల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, దూది రాజు, బాబివర్ధన, కౌన్సిలర్లు రెడ్నం సునీత, మన్యం చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us