Bheemla nayak: పవర్‌స్టార్‌ అభిమానులకు నిరాశ..భీమ్లా నాయక్‌ విడుదల వాయిదా!

రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: పవర్‌స్టార్‌ అభిమానులకు నిరాశ కలిగించే వార్త. పవన్‌ కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’ విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా.. విడుదల తేదీని ఫిబ్రవరి 25కి మార్చినట్లు తాజాగా వెల్లడించింది. సినిమా విడుదల వాయిదాపై గతంలోనూ వదంతులు రాగా.. వాటిని చిత్ర నిర్మాతలు తోసిపుచ్చారు. జనవరి 12నే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో సంక్రాంతి బరిలో పవన్‌ ఉంటారని అందరూ భావించారు. కానీ, ఆయన అభిమానులకు షాక్‌ ఇస్తూ చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఈ సంక్రాంతికి పాన్‌ ఇండియా సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని ‘భీమ్లా నాయక్‌’ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. నిత్యా మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us