Updated 19th April 2017 Wednesday 8:20 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మ వారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ. 11 .56 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈ వో వివి పళ్ళంరాజు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీలను లెక్కించామని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో దేవాదాయ శాఖ ఇనస్పెక్టర్ సుబ్రహ్మణ్యం, దేవస్థానం చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మి నాని, టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్ర ప్రకాష్ , పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







