Bangarraju: ‘బంగార్రాజు’ వచ్చేశాడు.. నాగ్‌, చై అదరగొట్టేశారు..!

సంక్రాంతి బరిలోకి దిగిన మన్మథుడు

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : ‘ఊరుకోవే పుటికీ.. కితకితలెడుతున్నాయ్‌’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు కింగ్‌ నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్యతో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ‘బంగార్రాజు’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య.. తండ్రీకొడుకులుగా కనిపించనున్నారు. ‘‘నువ్వు ఈ ఊరికే సర్పంచివి కాదు. మన రాష్ట్రానికే సర్పంచి కావాలి. మన దేశానికే సర్పంచి కావాలి’’ అంటూ కృతిశెట్టితో నాగచైతన్య చెప్పే డైలాగ్‌లు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ఇక, టీజర్‌ చివర్లో నాగార్జున, చైతన్య నడుచుకుంటూ వచ్చే సీన్‌లు.. హైలైట్‌గా ఉన్నాయి. చైని చూసి నాగ్‌ ఆనందంతో నవ్వుతూ మీసం మెలిపెట్టే సీన్‌ ఈలలు వేయించేలా ఉంది. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రిక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ.. చైతన్యకు జంటగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. నాగబాబు అతిథి పాత్ర పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us