గురజాడ దేశభక్తి గీతం అందరికీ స్ఫూర్తి

UPDATED 29th NOVEMBER 2017 WEDNESDAY 6:30 PM

పెద్దాపురం : మహాకవి గురజాడ దేశభక్తి గీతం అందరికీ ఆదర్శమని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. సోషల్ మీడియా ఫర్ సోసైటీ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు వర్దంతి సందర్బంగా తయారు చేసిన పోస్టర్ కరపత్రాలను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ సూరిబాబురాజు మాట్లాడుతూ ఎస్ఎమ్ఎస్ సభ్యులు చేస్తున్న పనులు చాలా అభినందించదగినవని, విద్యార్దుల్లో దేశభక్తిని పెంపొందించి వారి మనసుల్లోకి దేశభక్తి గేయాన్ని తీసుకునివెళ్ళాలని చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ గేయం నేర్చుకోవాలని, ఎంతకాలం అయినా ఈగేయం సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎస్.ఎమ్.ఎస్ ప్రతినిధులు ఎండీ.ముక్తార్ అలీ, కొల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు గురజాడ వర్దంతి సభ స్థానిక సాగర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే దీనికి ముఖ్య అతిధిగా ప్రముఖ కవి డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బళ్ళమూడి హరికృష్ణ, శ్యామ్ తాళ్లూరి, వంగలపూడి సురేష్, దారపురెడ్డి క్రాంతికుమార్, ఈర్షద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us