విష్ణుసదన్‌లో శీతల కల్యాణ మండపాలు

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: అన్నవరంలో సత్యగిరిపై ఉన్న విష్ణుసదన్‌లో పెద్దహాళ్లను శీతల కల్యాణ మండపాలుగా మార్చడానికి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌ అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుడు, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, ఈవో త్రినాథరావు, సభ్యులు, అధికారులు పలు అంశాలపై చర్చించారు. ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేందుకు రూ.85 లక్షలు, ఏసీలు ఏర్పాటుకు రూ.40.50 లక్షలు, విద్యుత్తు పనులకు రూ.35 లక్షలు కేటాయించారు. రత్నగిరిపై ఆయుష్య హోమం మండపం మరమ్మతులుకు, దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో పనులకు నిధులు కేటాయించారు. ప్రధానాంశాలివీ..: జనవరి 14న బోగి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ● దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి దేవస్థానం నుంచి జీతభత్యాలు కొనసాగించడానికి ఆమోదించారు. ● దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాలలో సిబ్బంది నియామకానికి, గతంలో దేవస్థానం బస్సు ప్రమాదంలో కాలు కోల్పోయిన యువకుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ● అదనపు పరిచారకులను సంభావన పద్ధతిపై వినియోగించుకోవడానికి వైదిక కమిటీ ఆధ్వర్యంలో 15 మందిని ఎంపిక చేయనున్నారు. ● దాత సహకారంతో సత్యగిరిపై నిర్మించిన ఉచిత కల్యాణ మండపం నిర్వహణ నిమిత్తం నామమాత్రంగా రుసుం వసూలు చేసే విషయంలో గతంలో తీర్మానం, కమిషనర్‌ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. ● వసతిగదుల విషయంలో భక్తులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సభ్యులు చర్చించారు. ఇకపై ఏఏ వసతి సముదాయాల్లో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి అనే ఎలక్ట్రానిక్‌ సమాచార బోర్డులు (తితిదే మాదిరిగా) ఏర్పాటు చేయాలని సభ్యులు సూచించారు. ● దుకాణాల్లో టెండరు షెడ్యూల్‌లో ఉన్న వస్తువులను విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us