చేనేత నిల్వలు ఆప్కో ద్వారా కొనుగోలు

UPDATED 17TH MAY 2017 WEDNESDAY 4:00 PM

పెద్దాపురం: చేనేత సొసైటీ ల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆప్కో డిఎంవో రామకృష్ణ మూర్తి పేర్కొన్నారు.  స్థానిక  మెయిన్ రోడ్, అంకయ్య పేటలో ఉన్న చేనేత సొసైటీలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ నెల 16న
డిఎంవో గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణమూర్తి జిల్లాలోని చేనేత సొసైటీలను పరిశీలించే క్రమంలో భాగంగా ముందుగా పెద్దాపురం పట్టణంలోని చేనేత సొసైటీలను పరిశీలించారు. ఈ రెండు సొసైటీలలో చేనేత కార్మికులు తయారుచేస్తున్న చేనేత వస్త్ర రకాలను, నాణ్యతా ప్రమాణాలు, నైపుణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రెండు సొసైటీల్లో పేరుకుపోయిన రూ. 25  లక్షలు విలువ చేసే వస్త్రాలను ఆయన గమనించారు. ఈ నిల్వలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఆయన అధ్యక్షులకు హామీ ఇచ్చారు. అలాగే చేనేత సొసైటీలు ఎక్కువ మంది కార్మికులకు పనులు కల్పించే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, గాంధీ సొసైటీ అధ్యక్షుడు తూతిక సత్యనారాయణ, ఆప్కో ఇనస్పెక్టింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జయకృష్ణ,  మేనేజర్లు ఆశపు సాంబమూర్తి, తూతిక చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us