పారిశ్రామికాభివృద్ధితోనే దేశాభివృద్ధి

UPDATED 30th JUNE 2017 FRIDAY 6:00 PM

గండేపల్లి: పారిశ్రామికాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఐఆర్ఎంఎ డైరెక్టర్ డాక్టర్ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజెమెంట్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై శుక్రవారం మాట్లాడారు. ఈ అంతర్జాతీయ సదస్సు డాక్టర్ ఎం. సుగుణా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికలు లేకపోతే వ్యాపారంలో రాణించడం కష్టమని, ఒక పరిశ్రమ స్థాపించాలంటే పలు అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పెట్టుబడి, మార్కెటింగ్, రెవిన్యూ, పరిసరాలు మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే మరో ముఖ్య అతిధులుగా హాజరైన డాక్టర్ సుమిత్ దావే, దీప్తి జాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యాపార దృక్పధాన్ని పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు మరింత పరిజ్ఞానం అందుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదన్నారు. డైరెక్టర్ సుగుణా రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సదస్సుల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థికి బిజినెస్ స్టడీ పై ఒక మంచి అవగాహన, నమ్మకం కలిగుతుందని, అనుభవజ్ఞులైన విశిష్ట వ్యక్తుల సూచనలు, సలహాలు తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బిజినెస్ మేనేజెమెంట్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us