గోదావరి వరదలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కావాలి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య

UPDATED 18th JULY 2020 SATURDAY 9:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): గోదావరి వరదలు, విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కావాలని సబ్- కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంతో గోదావరి వరదలు, విపత్తుల నివారణ తదితర అంశాలపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీవో ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ కోవిడ్-19 నేపధ్యంలో సెక్టారు అధికారులు నిర్వాసిత కుటుంబాలను పూర్తయిన పునరావాస కాలనీలకు తరలించాలని, నిర్మాణాలు పూర్తికాని గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాలను తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పనుల నిర్వహణకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టి విపత్తులు నిర్వహణకు సమాయత్తం కావాలని ఆదేశించారు. వరద హెచ్చరికలకు అనుగుణంగా ఆయా గ్రామాలకు నియమించిన సెక్టారు అధికారుల బృందం అప్రమత్తమై ముంపుభారిన గ్రామస్థులు పడకుండా ముందుగా తరలించాలని, అలాగే తమకు కావాల్సిన సామాగ్రిని సేకరించుకొని ముంపు బాధితులకు ఎలాంటి యిబ్బందులు తలెత్తకుండా సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే నిర్వాసితులను తరలింపు కార్యక్రమాలు ఈనెల 25 నుంచే ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బిందుమాధవ్, ఏపీవో పివిఎస్ నాయుడు, డిడి ఎం. సరస్వతి, ఎవో డి.ఎస్.వి. రమణ, సెక్టారు అధికారులు ఆర్‌డబ్ల్యు ఎస్ డిఇ నాగ వెంకట పద్మనాభం, ఎపిడి వై. లక్ష్మయ్యబాబు, పిహెచ్ఓ వై. సత్యనారాయణ, ఎడిఎ ఎన్. దైవకుమార్, ఉద్యాన అధికారి రమేష్, ఎస్.డి.సి ముక్కంటి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us