నేటి రాత్రి 12 గంటల వరకు బార్లు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం (డిసెంబరు 31న) అర్ధరాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు (క్యూలైన్లు అన్నీ క్లియర్‌ అయ్యేవరకు) తెరిచి ఉంచాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ నుంచి అన్ని డిపోల మేనేజర్లకు గురువారం రాత్రి సందేశాలు అందాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us