సమాచార సాంకేతికతతో కాకినాడకు స్మార్ట్ సదుపాయాలు

* భానుగుడి వరకు స్మార్ట్ రోడ్డు పనులు జూన్ రెండు నాటికి పూర్తి చేయాలి
* ప్రాజెక్ట్ పనుల అమలు సమీక్షలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
UPDATED 28th MARCH 2018 WEDNESDAY 7:00 PM 
కాకినాడ: స్మార్ట్ సిటీ పనులలో సమాచార సాంకేతిక రంగాల వినియోగం ద్వారా నగరంలో ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజా సమాచార వ్యవస్థను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. స్మార్ట్ సిటీ పనుల ప్రగతిపై స్థానిక కుళాయి చెరువు ప్రాంగణంలోని కమాండ్ అండ్ కమ్యూనికేషన్స్ సెంటర్ లో బుధవారం ఏజెన్సీస్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ అమలులో భాగంగా డేటా సెంటర్, డేటా రికవరీ సెంటర్, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్, స్మార్ట్ పోల్స్, ఎన్విరాన్మెంటల్ సెన్సార్స్, ఐపి బేస్డ్ పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటుకు త్వరితగతిన చేపట్టాలని, అలాగే వైఫై సౌకర్యాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు, విద్యార్థులకు కల్పించడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర ప్రజల భద్రతలో భాగంగా 350 సిసి టీవీలు, స్మార్ట్ సిటీ లైటింగ్, ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ సిస్టం ఏర్పాటు చేయాలని, నగరంలోని వ్యర్ధ పదార్ధాల తొలగింపుకు ఉపయోగించే వాహనాలకు జిపిఎస్ మోడ్ లో సెన్సార్లు ఏర్పాటుచేసి రియల్ టైం వ్యర్ధ పదార్ధాల తొలగింపు జరగాలన్నారు. అత్యవసర సమాచారం అందించడం కోసం ఎమర్జెన్సీ కాల్ బాక్స్, వారియేబుల్ డిస్ ప్లే  మురికివాడల్లో ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని  ట్రాఫిక్ రెగ్యులేషన్ లో భాగంగా పది ప్రాంతాల్లో ఆటోమేటిక్ నెంబర్ రెకగ్నిషన్ సిస్టం, రెడ్ సిగ్నల్స్ అతిక్రమించే వారిని గుర్తించే చర్యలు చేపట్టాలన్నారు. స్మార్ట్ పార్కులు ఏర్పాటు చేయాలని, నగరంలో విహెచ్ఎఫ్ సమాచార వ్యవస్థను మెరుగు పరచడం కోసం బేస్ స్టేషన్ ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 120 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్ పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే నగరంలోని సర్పవరం జంక్షన్ నుంచి బాలయోగి విగ్రహం జంక్షన్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర చేపట్టనున్న రోడ్డు పనులను జూన్ రెండు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ మొదటి వారంలో జరిగే నవ నిర్మాణ దీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉందని, అప్పటిలోగా రోడ్డు పనులు పూర్తిస్థాయిలో జరగాలన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ వి.విజయరామరాజు, అసిస్టెంట్ కలెక్టర్ ఓ. ఆనంద్, కాకినాడ నగరపాలక సంస్థ కమీషనర్ కె. శివపార్వతి, స్మార్ట్ సిటీ సిఈవో సుజయ్ అరుణ్, స్మార్ట్ సిటీ చీఫ్ ఇంజనీర్ సి. విజయ్ కుమార్, ఇఇ ప్రసాదరావు, కాకినాడ స్టెరిలైట్ కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణేష్, జోనల్ మేనేజర్ విజయ, స్మార్ట్ సిటీ నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.              
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us