ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు

అమరావతి, 27 మే 2020 (రెడ్ బీ న్యూస్) : టీడీపీ మహానాడు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు ఘన నివాళులర్పించారు. రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం కొనసాగనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ కోలాహలంగా మూడు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈసారి కరోనా వైరస్‌ దెబ్బ పడింది. లాక్‌డౌన్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో మహానాడును నిర్వహిస్తున్నారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కొద్ది మంది ముఖ్యులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇందులో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన నేతలంతా ఎవరి ఇంట్లోనే వారుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే పాలుపంచుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు సాంకేతిక సదుపాయం సమకూర్చే జూమ్‌ సంస్ధ నుంచి మహానాడు నిర్వహణ కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని మొత్తం 14 వేల మంది ఆన్‌లైన్‌లో దీనిని చూసే ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారు టీడీపీ వెబ్‌సైట్‌ లేదా ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఇచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. సమావేశాలను ఆన్‌లైన్‌లో మొత్తం ఆరు గంటలపాటు నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకూ తిరిగి సాయంత్రం నాలుగు నుంచి 5.30 గంటల వరకూ మహానాడు సమావేశాలు జరుగుతాయి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us