IT Raids: ఒప్పో, షావోమి కంపెనీల యూనిట్లపై ఐటీ దాడులు

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: దేశవ్యాప్తంగా చైనా ఫోన్ల తయారీ సంస్థలకు చెందిన కార్యాలయాలు, యూనిట్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. దిల్లీ, గురుగ్రామ్‌, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఒప్పో, షావోమీ సంస్థలకు చెందిన ఆఫీసుల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఒప్పో, షావోమీ సంస్థలకు చెందిన పంపిణీదారు భాగస్వాముల ఆఫీసులు, ఈ కంపెనీల్లో పనిచేస్తున్న సీనియర్‌ ఉద్యోగులు, డైరెక్టర్లు, సీఎఫ్‌వో తదితరుల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫోన్ల తయారీ యూనిట్లు, గోదాములను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. పన్ను చెల్లింపుల నిబంధలను ఈ కంపెనీలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఈ సంస్థలకు చెందిన ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కూడా సోదాలు జరిపారు. ఒప్పోకు చెందిన ఓ పంపిణీదారు కంపెనీకి ఈడీ కోట్లాది రూపాయల జరిమానా కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us