ఐఎస్ఎల్ నిర్మాణాలు వేగవంతం చేయాలి

UPDATED 8TH MAY 2017 MONDAY 12;15 PM

పెద్దాపురం: రెండవ దఫా ఐఎస్ఎల్ నిర్మాణాలను వేగవంతం చేయాలని పెద్దాపురం ఆర్డీవో  వి. విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో 12  గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచ్, ఎంపిటిసి లతో నిర్వహించిన సమావేశంలో అయన సోమవారం మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎల్ నిర్మాణాలను జులై నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ లు ప్రతీ ఇంటికి వెళ్లి లిస్ట్ ఆధారంగా లబ్ధిదారులు వ్యక్తిగతంగా నిర్మించుకున్న, వేరే వారి చేత నిర్మించుకుంటే వారి నుంచి అంగీకార పత్రాన్ని తీసుకోవాలన్నారు. జిల్లాను  వోడీఎఫ్ జిల్లాగా ప్రకటించిన సందర్భం గా అర్హులైన ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఎంపిపి గుడాల రమేష్ మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని పేర్కొన్నారు. ఎంపిడివో వసంత మాధవి మాట్లాడుతూ రెండవ దఫాలో 12 గ్రామాలకు 2500 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ ఎం.సాయిలీల, హౌసింగ్ ఏఈ శ్రీరామచంద్రమూర్తి , మండల కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, మండల టిడిపి ఉపాధ్యక్షుడు సింగన అరవిందకుమార్, పలు గ్రామాల సర్పంచ్ లు ఎంపిటిసి లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us