UPDATED 4th OCTOBER 2017 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులకు స్వచ్చంధ సంస్థల సహకారం కూడా ఎంతో అవసరమని రాష్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక సాగర్ మున్సిపల్ హైస్కూల్లో బచ్చు ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 60 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బచ్చు కోటేశ్వరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్చంధ సంస్థలు సహకారం చాలా అవసరమని, పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో బచ్చు ఫౌండేషన్ సంస్థ విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఫౌండేషన్ తరఫున పాఠశాలలు నిర్మించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మున్సిపల్ కమిషనేర్ బి.ఆర్. శేషాద్రి, కౌన్సిలర్ శెట్టి సుబ్బలక్ష్మి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ పి.దుర్గ, బచ్చు రామోహనరావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు జి.వి.ఎస్.ఆర్.కె. మూర్తి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, తదితరులు పాల్గొన్నారు.







