CM Jagan: దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

UPDATED 2nd OCTOBER 2022 SUNDAY 04:50 PM

CM Jagan Visits Indrakeeladri : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టుచీరతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు.

ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్ కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.సీఎం జగన్‌ దుర్గగుడి సందర్శన, పట్టువస్త్రాల సమర్పణ సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ముఖ్యమంత్రి చెప్పడంతో దర్శనాలు కొనసాగాయి.

ఓవైపు సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా.. మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి దుర్గగుడికి వస్తే రెండు గంటల పాటు దర్శనాలను ఆపేసే వారు అధికారులు. ఈసారి మాత్రం సీఎం సూచనతో దర్శనాలకు బ్రేక్ పడకుండా చూశారు. ఆదివారం (అక్టోబర్ 2) మూల నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us