AP Telangana Debts : అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణ అప్పుల వివరాలు విడుదల

UPDATED 25th JULY 2022 MONDAY 07:30 PM

AP Telangana Debts : ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రానికి 3లక్షల 12వేల 191 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని తెలిపింది.

రాష్ట్రాల అప్పుల వివరాల గురించి లోక్ సభ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో ఏయే రాష్ట్రం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత మొత్తం రుణంగా తీసుకుందని అనే విషయాన్ని కేంద్రం ప్రకటించింది.

రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. బడ్జెటేతర రుణాలను మాత్రం కేంద్రం ఈ జాబితాలో పొందుపరచలేదు. బడ్జెట్ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది.(AP Telangana Debts)

ఏపీలో అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,07,671 కోట్లుగా కాగా.. 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,60,333 కోట్లు. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇక తెలంగాణ రాష్ట్రం అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.2,25,418 కోట్లు. 2021 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.2,67,530 కోట్లు. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.3,12,191 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us