విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఆరునూరైనా తెదేపా అధినేత చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. సమర్థ నాయకుడు వస్తేగానీ రాష్ట్రంలో పరిస్థితి చక్కబడదని చెప్పారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దన్నారు.. ఇంతవరకు లేదు. పీఆర్సీ వస్తే జీతాలు తగ్గుతాయని చెప్పడం.. ఇదేమి చోద్యం. కార్మిక సంక్షేమం జరగాలంటే మళ్లీ తెదేపా రావాలి’’ అని అచ్చెన్న అన్నారు.







