UPDATED 1st MARCH 2018 THURSDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల క్రికెట్ జట్టు ఫైనల్స్ లో రన్నర్ గా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 24 నుంచి 28 వరకు కాకినాడ ఐడియల్ కళాశాలలో జరిగిన జె.ఎన్.టి.యు.కె జోన్-బి క్రికెట్ పోటీలు ఫైనల్స్ లో తమ కళాశాల విద్యార్థులు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల జట్టుతో తలపడి రన్నర్ గా నిలిచి, ఈ నెల ఐదవ తేదీ నుంచి విజయనగరం రఘు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారని అయన తెలిపారు. ఈ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి రన్నర్ గా నిలిచిన టీమ్ కెప్టెన్ తారకరామ్, జట్టు సభ్యులు, ఫిజికల్ డైరెక్టర్ ఆర్. తిరుమలరావులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, తదితరులు అభినందించారు.







