ఆకాశంలో అగ్ని వెదజల్లుతున్నట్టుగా కాంతిరేఖలు

UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 07:00 AM

కడప: ఆకాశంలో అగ్ని వెదజల్లుతున్నట్టుగా కాంతి రేఖలు పైకి పోతూ కనిపించాయి. సోమవారం ఉదయం సుమారు 6 గంటల నుంచి 6-30 వరకు తూర్పు దిశలో ఇలా కనిపించడం చూసిన వారు ఆశ్చర్యపోయారు. వెంటనే నిద్రపోతున్న వారిని సైతం నిద్ర లేపి ఆ దృశ్యాలను చూపించారు. ఇలాంటి కాంతి ఎప్పుడూ చూడలేదంటూ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. చాలా ప్రాంతాల్లో ఇలా కనిపించడంతో ఆశ్చర్యంగా దీనిగురించి చర్చించుకుంటూ కనిపించారు. కొందరు ఆందోళన చెందారు. చివరకు ఈ కాంతి కిరణాలు శ్రీహరి కోటలోని షార్‌ కేంద్రంలో ఈవోఎస్‌-04 ఉపగ్రహాన్ని కక్ష్యలోనికి పంపిన సమయంలో వచ్చిన వెలుగని తెలిసి నవ్వుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us