UPDATED 26th FEBRUARY 2018 MONDAY 6:00 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిణిగా ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆమె సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఆమె విజయవాడ సి.సి.ఎల్.ఎ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1990 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి, సామర్లకోట, యు.కొత్తపల్లి, రామచంద్రపురం మండలాలలో డిప్యూటీ తహసీల్దార్ గా, 2005 నుంచి కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో పనిచేశానన్నారు. అనంతరం పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పరిపాలనాధికారిగా, 2014 నుచి సి.సి.ఎల్.ఎ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేస్తూ వాటర్ వర్క్స్, హెచ్ఎండిఎ, టూరిజం శాఖకు సంబంధించి పనిచేశానని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తానని ఆమె తెలిపారు.







