Ram Charan : రామ్‌చరణ్‌కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన అమిత్ షా.. పవన్ కళ్యాణ్ లేఖ!

Updated 27th March 2023 Monday 3:20 pm

Ram Charan : నేడు (మార్చి 27) మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ తో సందడి చేస్తున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ ని మరింత రేటింపు చేస్తూ.. చరణ్ నటిస్తున్న RC15 చిత్రం నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఉదయం మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. గేమ్ చెంజర్ (Game Changer) అనే టైటిల్ ని ఖరారు చేయగా, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ట్రేండింగ్ లో ఉన్నాయి.

ఇక RRR తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ కి.. ప్రపంచం నలుమూలల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలోని సినీ, రాజకీయ ప్రముఖులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా చరణ్ కి ప్రత్యేకంగా కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యకంగా ఫోన్ చేసి మరి విషెస్ చెప్పడంతో రామ్ చరణ్ హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర హోమ్ మంత్రి ఫోన్ చేసి మరి విషెస్ చెప్పడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా విషెస్ తెలియజేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us