హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్‌పై రూ.2లు చొప్పున పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ వెల్లడించింది. అలాగే, లీటరు హోల్ మిల్క్‌పైనా రూ.4ల చొప్పున పెంచింది. పెంచిన ఈ ధరలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ధరలు పెరిగిన దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు.







