Indian 2: ఇండియన్-2 మరో అప్డేట్.. ఇంకా ఎంతకాలం మాస్టారు..?

Updated 4th May 2023 Thursday 6:10 pm

Indian 2: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’ కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో సెట్ అయ్యాయి. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పలు దఫాలుగా జరుపుకోగా, ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్‌ను మే 24 నుండి ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్‌ను చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ షెడ్యూల్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌ను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్‌ను జూన్ చివరినాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కాగా, ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోండగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us