సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

UPDATED 15th OCTOBER 2020 THURSDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఒడిషా డీజీపీ కలిసి సంయుక్తంగా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉభయ రాష్ట్రాల డిజిపిలు సంయుక్తంగా జాయింట్ టాస్క్ ఫోర్స్  ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు గురించి చర్చించారు. అలాగే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో తీసుకోవలసిన భద్రతా చర్యలు గురించి ఉన్నతాధికారులు చర్చించి తగు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అడిషనల్ అడ్మిన్ ఎస్పీ కె. కుమార్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎం. అంబికా ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఎన్. రజనీకుమార్, ఇనస్పెక్టర్ గజేంద్ర కుమార్, ఉభయ రాష్ట్రాలకు చెందిన ఇంటలిజెన్స్  అధికారులు కూడా పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us