Updated 14th Feruary 2023 Tuesday 7:50 pm
Minister Roja: టీడీపీ నేత నారా లోకేష్‌కు ఏపీ మంత్రి రోజా సవాల్ విసిరారు. తన ఆస్తులతోపాటు, నారా లోకేష్ కుటుంబ ఆస్తులపై సీబీఐ విచారణ చేయించేందుకు సిద్ధమా అని రోజా సవాల్ చేశారు. చిత్తూరు జిల్లా, నగరిలో రోజా ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తిన సంగతి తెలిసిందే.
నారా లోకేష్‌పై రోజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, టీడీపీ కార్యకర్తలు రోజా ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఈ అంశంపై రోజా స్పందించారు. నారా లోకేష్‌పై మండి పడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్లతో లోకేష్ యాత్ర చేస్తున్నాడు. మా నియోజకవర్గంలో ఉన్న వాళ్లు నిన్న లోకేష్‌ను కొట్టడానికి వచ్చారు. లోకేష్ కోసం పవన్ ‘వారాహి’ని పక్కనబెట్టారు. నేను జబర్దస్త్ అయితే.. పాలు అమ్మే మీ తల్లి, భార్య ఎవరు? వారి గురించి నేను మాట్లాడను.
దమ్ముంటే నీ సంపాదన, నా సంపాదనపై సీబీఐ వేద్దాం. నేను కష్టపడి షూటింగ్ చేసి ఇల్లు కట్టుకున్నా. హెరిటేజ్ వెహికల్‌లో ఎర్ర చందన తరలించింది ఎవరు? జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా? లోకేష్ ఎవరు అంటే.. చంద్రబాబు కొడుకు.. బ్రాహ్మణి భర్త అని చెప్పుకోవాలి. లోకేష్ ఇంకోసారి నా గురించి మాట్లాడితే ఆడవాళ్లతో కొట్టిస్తా. టీడీపీ ప్రభుత్వంలో నరకం చూపించినా.. ఎదుర్కొని నిలబడ్డా’’ అని రోజా వ్యాఖ్యానించారు.







