ఆదిత్యలో ఘనంగా మహిళా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

UPDATED 20th NOVEMBER 2017 MONDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మహిళా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణా రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ది కాకినాడ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ సి.వి. రాఘవ కోసూరి హాజరైనారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ సుమారు 144 దేశాలలో మహిళా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకుంటున్నారని,  శక్తి సామర్ధ్యాలలో కాని, తెలివితేటలలో కాని, పురుషులతో పోల్చితే మహిళలకు ఓర్పు, సహనం అధికమన్నారు. అనంతరం మహిళా పారిశ్రామికవేత్తలు శ్రీమతి లక్ష్మి, సత్య, ఎన్. శ్రీదేవి, అశోక్ తల్వార్, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, మేనేజ్మంట్ విభాగాధిపతి సుమ, అధిక సంఖ్యలో విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us