CM Jagan: సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 04:00 PM

అమరావతి: సినిమా పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమలో భూసేకరణకు నిర్ణయించింది. సినిమా షూటింగ్ లు, స్టూడియోల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భూనిధి ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 10న తెలుగు సినిమా ప్రముఖులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలని అన్నారు. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని చెప్పారు. అందరికీ స్ధలాలు ఇస్తామని, స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామని, జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దామన్నారు. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండి అని జగన్ అన్నారు.

తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థియేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోందని.. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోందని చెప్పారు. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ అన్నారు. వాతావరణం కూడా బాగుంటుందన్నారు.

విశాఖ బిగ్గెస్ట్‌ సిటీ. కాస్త పుష్‌ చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం అన్నారు. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి… అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా… ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను .. అని అన్నారు.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో విశాఖ పోటీ పడగలదన్నారు. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరారు. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలన్నారు. సినీ పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని ప్రకటించారు. టికెట్ రేట్లకు సంబంధించి అందరికీ ఒకే రేట్లు అని చెప్పారు. ఆన్ లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి మంచిదని అభిప్రాయపడ్డారు. సినిమా చూసే ప్రేక్షకులకు టికెట్ రేట్ల భారం కాకూడదన్నారు. ఐదో షో వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని పేర్కొన్నారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా తనతో పంచుకున్నారని తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us