ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1.60 లక్షల కొత్త కేసులు వెలుగులోకి రావడం వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. ఇక పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. శనివారం 15,63,566 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగ్గా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.71 శాతం వద్ద కొనసాగుతోంది.







