కొనసాగుతున్న గ్రామీణ డాక్‌ సేవక్స్‌ సమ్మె

UPDATED 30th MAY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు కమలేష్‌చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె బుధవారం ఎనిమిదవ రోజుకు చేరుకుంది.  స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద వారు మాట్లాడుతూ సమాచార రంగం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ తపాలా ఉద్యోగుల సేవలు ఎంతో విలువైనవి అన్నారు. భారతదేశంలో పోస్టల్‌శాఖ ఎంతో చారిత్రాత్మకమైనదని, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులంటే అందరికీ గౌరం అన్నారు. ఒకప్పుడు పోస్ట్‌మెన్‌ కోసం ఎదురు చూసేవారని, సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు పనిభారం తగ్గకపోగా ఎక్కువైందన్నారు. తమ సమస్యలను తక్షణమే  పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు.   
 
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us