మినీ మహానాడు సక్సెస్

UPDATED 23rd MAY 2017 WEDNESDAY 7:00 PM

ప్రత్తిపాడు : తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  మినీ మహా  నాడు సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళా వెంకట్రావు, ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిధులుగా హాజరై పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. హోం మంత్రి చినరాజప్ప అధ్యక్షతన జరిగిన ఈ మహానాడులో పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు. అనుక్షణం కార్యకర్తల సంక్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు  మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని రాష్ట్ర బడ్జెట్ రూ. 1 .50 లక్షల కోట్లు అయితే ప్రస్తుతం రూ. 24 వేల కోట్ల లోటుబడ్జెట్ లోఉందన్నారు. హోం మంత్రి  చినరాజప్ప మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సూచనల మేరకే నడుచుకుంటూ పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కష్టపడి పని చేసేవారికి పార్టీ లో సముచిత స్థానం లభిస్తుందన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే లు వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, గొల్లపల్లి  సూర్యారావు, వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు, డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా తదితరులు మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పర్వత సురేష్ ఆధ్వర్యంలో ఎనిమిది తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యే లు పిల్లి అనంతలక్ష్మి, పెందుర్తి వెంకటేష్, పులవర్తి నారాయణమూర్తి, రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీశేషసాయి, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us