ఎస్.సి, ఎస్.టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

UPDATED 26th MAY 2018 SATURDAY 10:00 PM

పెద్దాపురం: ఎస్.సి, ఎస్.టి విజిలెన్స్ మోనటరీ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చిన సమస్యలపై సంబంధిత తహసీల్దార్లు సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ఎస్.సి, ఎస్.టి విజిలెన్స్ కమిటీ మోనిటరీ సమావేశం ఆర్డీఓ అధ్యక్షతన డి.ఎస్.పి చిలకా వెంకట రామారావు సమక్షంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్లోని ఎస్.సి, ఎస్.టి వర్గాల వారి సమస్యలపై కమిటీలో చర్చించిన అంశాలను రెవిన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఈ సందర్బంగా ఎస్.సి, ఎస్.టి కమిటీ సభ్యులు రాజేంద్ర మాట్లాడుతూ ఏలేశ్వరం అంబేధ్కర్ నగర్ ఎస్.సి కాలనీలో శానిటేషన్ సరిగా లేదని,  డ్రైన్ నిర్మాణం నాణ్యత లోపంతోఉందని, అలాగే పెదశంకర్లపూడికి సంబందించిన హౌసింగు స్కీమ్ పేమెంట్లు పెండింగులో ఉన్నాయని చెప్పారు. ధర్మవరంలో ఎస్.సి చెందిన భూమి ఆక్రమణ, వంతాడ మైనింగు రోడ్డుకు సంబందించి ఎస్.సి కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించడం జరిగింది. కమిటీ మెంబరు గుడాల కృష్ణ మాట్లాడుతూ ఎనిమిది మందికి కుల ధృవీకరణ పత్రాలు పెండింగులో ఉన్నాయని, ఎస్.సి కేసులు 33 కేసులు పెండింగులో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డి.ఎస్.పిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డవో కార్యాలయం ఏవో నాంచారయ్య, పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, డివిజన్లోని తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us