ఆదిత్య విద్యార్థుల విజయాలకు క్రమశిక్షణ ప్రథమం

UPDATED 17th JULY 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: ఆదిత్య విద్యార్థుల విజయాలకు క్రమశిక్షణే ప్రథమ సోపానమని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ ప్రాంగణంలో గల ఆదిత్య ఫోరెన్సిక్ సైన్స్ 2018-19 విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సరం తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన విద్యార్థులు, తల్లితండ్రులతో నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. మోహన్, కేరళ రాష్ట్రానికి చెందిన సాహింద్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ శేషారెడ్డి  మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో దక్షిణ భారతదేశంలో ప్రథమంగా 2017వ సంవత్సరంలో మూడు సంవత్సరాల  ఫోరెన్సిక్ సైన్స్ డిగ్రీ కోర్సు ప్రారంభమైందని, ఈ కోర్సును ఆరు సెమిస్టర్లలో పూర్తి చేయాలని అన్నారు. కోర్సు పూర్తయిన అనంతరం బ్యాంకు, రక్షణ, తదితర రంగాలలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థుల సందేహాలు తీర్చడానికి సంస్థ ప్రాంగణంలో అధ్యాపక సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, అంతేకాక యూనివర్సిటీ అనుమతితో ఈ కోర్సు సిలబస్ కూడా ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్, సాహింద్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థి శ్రేయస్సే పరమావధిగా భావించే యాజమాన్యం, ఎన్నో ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లితండ్రుల కలల సాకారానికి నూరుశాతం ఆదిత్య కృషి చేస్తుందని, క్రమశిక్షణతో ఆదిత్యలో గల అన్ని వసతులను వినియోగించుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us