తిరుమల (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: మంత్రాలయం రాఘవేంద్ర మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామీజీకి తితిదే శ్రీవారి ఆలయం తరఫున శనివారం ఉదయం పెద్దమర్యాద చేసింది. అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించగా.. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామీజీకి తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.







