రెడ్ బీ న్యూస్,19 డిసెంబర్ 2021: ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్‌జోహర్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘యోధ’. ఇటీవలే ‘షేర్షా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడు. నూతన దర్శక ద్వయం పుష్కర్ యోజ-సాగర్ అంబ్రీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికల పేర్లను ప్రకటించారు. దిశా పటానీ, రాశి ఖన్నా ఇందులో సిద్ధార్థ్‌తో జోడీ కట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాశి మాట్లాడుతూ ‘‘చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అంది. దిశా పటానీ మాట్లాడుతూ ‘‘నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తాను. పాత్ర కోసం వందశాతం కష్టపడతాను’’ అని చెప్పింది. భారీ యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.







