UPDATED 23rd OCTOBER 2017 MONDAY 7:00 PM
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామాల్లో కార్తీకమాసం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సామర్లకోట కుమారరామభీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగాయి. భక్తులు శివలింగ దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ఆలయాల్లో ఉన్న శివలింగం యోగ లింగం కావడంతో ఆలయంలో ఉన్న శివలింగానికి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి అభిషేకాలు చేశారు. భక్తులు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది అనే విశ్వాసం భక్తులకు ఉండటంతో విశేషంగా పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్నిశైవ క్షేత్రాల్లో భక్తులు పరమశివుడి దర్శనం కోసం బారులు తీరారు.







